ETV Bharat / state

వృథాగా పడి ఉన్న యంత్ర పరికరాలు..లబ్ధిదారుల ఎదురుచూపులు

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం రాయితీ రుణాలు అందిస్తుంది. దీనిద్వారా యంత్రాల యూనిట్ల కొనుగోలుకు నిధులు కేటాయించింది. దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారులను ఎంపిక చేసింది. కానీ పంపిణీలో జాప్యం జరిగింది. దీంతో ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ట్రాక్టర్లు, డ్రై క్లీనింగ్‌ యంత్రాలు, పడవలు, ఆటోలు నిరుపయోగంగా ఉండిపోయాయి.

machinery as useless
వృథాగా పడి ఉన్న యంత్ర పరికరాలు
author img

By

Published : Nov 9, 2020, 10:09 AM IST

ప్రకాశం జిల్లా ఒంగోలులో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఏటా ఆయా సామాజిక వర్గాల కార్పొరేషన్లు రాయితీ రుణాలు మంజూరు చేస్తున్నాయి. అదే తరహాలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారులను ఎంపిక చేసింది. అప్పట్లోనే యూనిట్ల కొనుగోలు నిమిత్తం ప్రభుత్వం నిధులు కేటాయించింది. కానీ సంబంధిత అధికారులు యూనిట్ల పంపిణీలో జాప్యం చేశారు. దీంతో ట్రాక్టర్లు, డ్రై క్లీనింగ్‌ యంత్రాలతో పాటు, మత్స్యకారులకు సంబంధించిన పడవలు, ఆటోలు ప్రభుత్వ కార్యాలయాల్లోనే తుప్పు పట్టి నిరుపయోగంగా మారుతున్నాయి. అదే సమయంలో రెండేళ్లుగా లబ్ధిదారులకు ఎదురు చూపులు తప్పడం లేదు.

ఉద్దేశం: గ్రామాల్లో స్వచ్ఛత.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నిరుద్యోగులకు ఉపాధి కల్పన. చెత్త తరలింపునకు 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆటోలు, ట్రాక్టర్లు, డ్రై క్లీనింగ్‌ యంత్రాలు ఇవ్వాలని నిర్ణయం.

పద్ధతి.. ప్రతిపాదన: ఎస్సీ కార్పొరేషన్‌ కింద 135 గ్రామ పంచాయతీలకు 60 శాతం రాయితీపై పంపిణీ చేసేందుకు ఆటోల కొనుగోలు. ఒక్కో దాని ఖరీదు రూ.2.06 లక్షలు. అందులో రాయితీ రూ.1.23 లక్షలు; మరో రూ.82 వేలు ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ కింద రుణం ఇవ్వనుంది. ఆటో కేటాయించిన పంచాయతీ నెలకు రూ.10 వేలు చొప్పున కార్పొరేషన్‌కు చెల్లించాల్సి ఉంటుంది. రూ.2,510 ఈఎంఐని రుణం కింద జమ చేసుకుంటారు. మిగతా నగదును లబ్ధిదారుని ఖాతాలో జమ చేస్తారు.

135 ఆటోల కొనుగోలు...: ఆ ఏడాదిలో 135 ఆటోలు కొనుగోలు చేశారు. అందులో మద్దిపాడు, నాగులుప్పలపాడు, సంతనూతలపాడు, టంగుటూరు ప్రాంతాల్లోని ప్రభుత్వ కార్యాలయ ఆవరణల్లో 121 ఆటోలు ఉంచారు.

మండలానికో ట్రాక్టర్‌: జిల్లాలో 56 మండలాలుండగా., కాలువల్లో పూడికతీత పనుల నిర్వహణ నిమిత్తం ప్రతి మండలానికి ఒక్కో ట్రాక్టర్‌, డ్రై క్లీనింగ్‌ యంత్రాన్ని కేటాయించారు. ఒక్కో యూనిట్‌ ఖరీదు రూ.15.20 లక్షలు.. రాయితీ రూ.5.25 లక్షలు(35 శాతం); ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ రుణం రూ.9.75 లక్షలు; లబ్ధిదారుని వాటా రూ.20 వేలు.

వాటా మొత్తం కట్టించుకుని...: యూనిట్లు అందజేసేందుకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రారంభంలోనే 18 మండలాలకు ఇవ్వగా., మరో 38 మండలాలకు ప్రక్రియ నిలిచి పోయింది.

ఎండకు ఎండి.. వానకు తడిచి...

యూనిట్లు చేతికి అందితే తద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతామని అందరూ భావించారు. పంపిణీలో జాప్యం చోటుచేసుకోవడం, అంతలోనే సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత అధికారులు కూడా వాటి పంపిణీ గురించి పట్టించుకోకపోవడంతో చెట్ల కిందనే ఉండిపోతున్నాయి. ఇనుప వస్తువులు కావడంతో వానకు తడిచి, ఎండకు ఎండి కొన్ని భాగాలు తప్పు పట్టాయి. లబ్ధిదారుని చేతికి అందక ముందే శిథిలావస్థకు చేరాయి. ఇప్పటికి రెండేళ్లు కావస్తున్నా.. లబ్ధిదారులకు యూనిట్లు అందకపోవడం శోచనీయం.

పాతవి రద్ధు. కొత్తగా లేదు లబ్ధి...

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కార్పొరేషన్ల ద్వారా మంజూరయ్యే వ్యక్తిగత రాయితీ రుణాల కోసం అధిక సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారులను గుర్తించారు. యూనిట్ల స్థాపన సమయానికి సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో రాయితీ నగదు విడుదలకు అడ్డంకిగా మారింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఎంపికై రాయితీ విడుదల కాని యూనిట్లను రద్దు చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసే రుణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం వారికి కల్పించింది. యూనిట్ల స్థాపన, క్షేత్రస్థాయిలో మూడో పార్టీ పరిశీలన వరకు షెడ్యూల్‌ కూడా ప్రకటించింది. ఇదంతా ఈ ఏడాది ఏప్రిల్‌లోనే పూర్తి కావాలి. కానీ ముఖాముఖి దశలోనే ప్రక్రియ నిలిచిపోయింది.

మాకొద్దీ పడవలు...: మత్స్యకారులు చేపల వేట సాగించేందుకు 90 శాతం రాయితీపై పడవలను పంపిణీ చేసేందుకు లబ్ధిదారులను గుర్తించారు. 10 శాతం చొప్పున లబ్ధిదారుని వాటా కట్టించుకున్నారు. గత ఏడాది పంపిణీ సమయానికే ఎక్కువ శాతం మరమ్మతులకు గురయ్యాయి. వాటిని తీసుకునేందుకు లబ్ధిదారులు వెనకడుగు వేశారు. దీంతో బీసీ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద నిరుపయోగంగా ఉన్నాయి.

త్వరలో పంపిణీ చేస్తాం...

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మంజూరైన ఆటోలు, ట్రాక్టర్లు, డ్రై క్లీనింగ్‌ యంత్రాలను త్వరలోనే లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రణాళిక చేస్తున్నాం. అందుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తున్నాం. - లక్ష్మానాయక్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఇన్‌ఛార్జి ఈడీ

ఇదీ చదవండి: కొత్త ఇసుక విధానం.. కేంద్ర సంస్థలకు రాష్ట్ర గనులశాఖ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.