ప్రకాశం జిల్లాలో లాక్‌డౌన్ వివిధ దశల్లో అమలైంది. ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చిన సడలింపులు ఇవ్వడం... రవాణా సౌకర్యాలు ప్రారంభం కావడం వల్ల వివిధ ప్రాంతాల్లో ఉన్న జిల్లావాసులు స్వస్థలాలకు తిరిగి వచ్చారు. ఫలితంగా కరోనా వ్యాప్తి అధికమైంది. జిల్లాలో ఇప్పటివరకూ 340 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క ఒంగోలులోనే 83 కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని కొన్ని పట్టణాల్లో అధికారులు మళ్లీ లాక్‌డౌన్ విధించారు.
చీరాలలో 48, వేటపాలెంలో 16, కందుకూరులో 22, టంగుటూరులో 14, కనిగిరిలో 9, మార్కాపురంలో 10, గుడ్లూరులో12 కేసులు బయటపడ్డాయి. ఐదు రోజుల క్రితం కేవలం 175 కేసులు ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య రెట్టింపయ్యింది. ఇప్పటివరకూ 137 మంది డిశ్చార్జ్ అయ్యారు. జిల్లా కేంద్రంలో కొవిడ్ వ్యాప్తి అధికంగా ఉండటంతో ఒంగోలు, చీరాల, మార్కాపురం పట్టణాల్లో అధికారులు మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ ప్రకటించారు. నిత్యావసరర సేవలకు మినహాయింపు ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా 47 కంటైన్‌మెంట్ జోన్లు విధించారు.
అయితే గతంలో విధించిన లాక్డౌన్తో తీవ్రంగా నష్టపోయామని.. మరోసారి లాక్డౌన్తో ఇంకా నష్టపోతామని వాపోతున్నారు.
ఇదీచదవండి.