ETV Bharat / state

వేడెక్కిన రాజకీయ వాతావరణం.. ఒకే పార్టీలో వర్గ పోరు - ఈరోజు ప్రకాశం జిల్లా స్థానిక ఎన్నికల వార్తలు

పంచాయతీ ఎన్నికలతో ప్రకాశం జిల్లాలోని పల్లెలు వేడెక్కాయి. తొలివిడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది.. రెండో విడత ఎన్నికలకు కూడా నామినేషన్లు దాఖలు ప్రక్రియ జోరందుకుంది. పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ, అధికార, ప్రతిపక్ష పార్టీల మద్దతు దారుల పోటీలతో హడావుడి సాగుతోంది. ఒకే పార్టీలోని వారు వర్గాలుగా విడిపోయి.. పోటీ పడుతున్నారు. ఇంకొన్ని చోట్ల లాటరీ పద్దతిలో అభ్యర్ధులను ఎంపిక చేయటం, పదవులకు వేలం పాటల నిర్వహణతో వాతావరణం మరింత వేడెక్కుతోంది.

local elections in prakasam district
ఒకే పార్టీలోని వారు వర్గాలుగా విడిపోయి పోటీ
author img

By

Published : Feb 2, 2021, 9:18 PM IST

పల్లె పోరు రసవత్తరంగా మారింది. జనరల్‌ ఎన్నికలంతా ప్రచారాలు, సభలు లేకపోయినప్పటికీ వర్గ, కుల, బంధువుల ప్రభావాలతో ఎన్నికలు హడావుడి ప్రారంభమయ్యింది. ప్రకాశం జిల్లాలో నాలుగు విడతల్లో 1018 పంచాయతీలకు ఎన్నికలు ప్రకటించారు. తొలిత 28 పంచాయతీలు కోర్టు వివాదాలు కారణంగా ఎన్నికలు నిర్వహణకు నోటిఫికేషన్‌ విడుదల చేయలేదు.. నాగులప్పలపాడు మండలం కనపర్తి, దాసరివారిపాలెం పంచాయతీ ఎన్నికలు చివరి నిమిషంలో రద్దయ్యాయి. ఈ రెండు పంచాయతీలు పునర్విభజన‌ సక్రమంగా జరగలేదని ఒకరు కోర్టుకు వెళ్ళగా ఎన్నికలపై కోర్టు స్టే ఇచ్చింది. దీంతో నామినేషన్లు, పరిశీలనా కార్యక్రమం పూర్తైన తరువాత ఎన్నికలు నిలిపివేస్తూ జిల్లా ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకున్నారు.

వర్గాల పోరు..

కారంచేడు మండలంలోని నాయుడు వారిపాలెం, పోతునవారిపాలెంలలో ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద తొలివిడత ప్రకటించిన 229 పంచాయతీల్లో 225 పంచాయతీలకు ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. అధికార పక్షంలో పోటీ ఎక్కువగా ఉండటం.. ప్రతీ పంచాయతీల్లో విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వేటపాలెంలో ఎన్నికలు జరుగుతున్న ఏకైక పంచాయతీ రామన్నపేటలో వైకాపా నుంచి రెండు వర్గాల అభ్యర్థులు పోటీలో నిలుస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, ఎమ్మెల్యే కరణం బలరాం లకు చెందిన అభ్యర్థులు ఉండగా, తెదేపాకు చెందిన వ్యక్తి కూడా పోటీ చేస్తున్నారు. దీంతో ఈ పంచాయతీ ప్రతిష్టాత్మకంగా మారింది.

వేలంతో పోటీ లేదు...

తొలివిడత ఒంగోలు డివిజన్‌లో ఉన్న 14 మండలాల్లో 229 పంచాయతీలకు ఎన్నికలు ప్రకటించారు. నాగులప్పలపాడు మండలం కొత్తకోటలో స్థానం ఏకగ్రీవం కానుంది. గ్రామాభివృద్ధికి 15 లక్షల రూపాయలు విరాళం ఇస్తామని ప్రకటించటంతో మిగతావారు పోటీకి దిగలేదు. ఒంగోలు మండలం బొద్దులూరివారి పాలెంలో వైకాపా, తెదేపా నాయకులు సమన్వయంతో ఏకగ్రీవానికి సిద్దమవుతున్నారు. లాటరీ పద్దతిపై పదవీ కాలాన్ని చెరో రెండున్నర సంవత్సరాలు సర్ధుకున్నారు. నాగులుప్పలపాడు మండలం కనపర్తి, దాసరిపాలెం పంచాయతీలు నామినేషన్లు ప్రక్రియ పూర్తయిన తరువాత ఎన్నికలు నిలిచిపోయాయి.

పరస్పర ఆరోపణలు..

హెచ్‌.నిడమనూరు పంచాయతీ సంబంధించి అభ్యర్థల విషయంలో వివాదం నెలకొంది. అన్ని పత్రాలు సమర్పించి, దాదాపు అన్ని చోట్లా సంతకాలు పెట్టించుకున్న ఎన్నికల అధికారి, పరిశీలనలో కూడా అన్నీ సక్రమంగా ఉన్నాయని చెప్పి తరువాత, సంతకాలు లేవని నామినేషన్‌ తిరస్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ కొప్పోలు వీరయ్య ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు ఎన్నికలు అధికారులు పని చేస్తున్నారంటూ ఆరోపించారు.

గెలిపించుకునేందుకు వ్యూహాలు..

రెండో విడత జరుగుతున్న 14 మండలాల్లో దర్శి నియోజకవర్గంలో పోటీ రసవత్తరంగా మారింది. దర్శి, ముండ్లమూరు, తాళ్ళూరు, దొనకొండ, కురిచేడు మండలాల్లోని 92 పంచాయతీల్లో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. వైకాపాలో రెండు వర్గాల మధ్య పోరు సాగుతోంది. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్‌ రెడ్డిల మధ్య విభేధాలు కారణంగా ఆయా వర్గాలకు చెందిన నాయకులు పోటీకి సిద్దమయ్యారు. అవసరం అయితే తెదేపా సహకారం తీసుకొని తమ తమ వర్గాలకు చెందిన అభ్యర్థులను గెలిపించుకోని ప్రాతినిథ్యం పెంచుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

మంత్రి ఇలాకాలో...

అధికార పార్టీ అత్యధికంగా ఏకగ్రీవాలకు కోసం ప్రయత్నించినప్పటికీ.. సాధ్యం కాక దాదాపు అన్ని చోట్ల పోటీకి సిద్దమయ్యారు. అయితే 90శాతం పంచాయతీలను తామే గెలుచుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు అధికారు పార్టీ నేతలు. రాష్ట్ర విద్యుత్తు శాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సొంతగ్రామం కొణిజేడులో అధికార పార్టీలోనే మూడు గ్రూపులు వారు సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. మంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పంచాయతీని తిరుగుబాటు అభ్యర్థులు రంగంలో లేకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇవీ చూడండి...: పంచాయతీ ఎన్నికలు కొత్త పుంతలు.. పల్లెల్లోనే బస్తీ వాసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.