Land Grabs in Ongole: ఒంగోలులో కబ్జా రాయుళ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. దొంగ వీలునామాలు, నకిలీ రిజిస్ట్రేషన్లు, పవరాఫ్ అటార్నీలు పుట్టించి.. కోట్లాది రూపాయల భూములను కొట్టేసేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. ఈ తతంగమంతా.. అసలు హక్కు దారునికి తెలిసేలోపే అంతా జరిగిపోతుంది. దీంతో న్యాయం చేయాలంటూ స్థల యజమానులు కోర్టులు, అధికారులు చుట్టూ తిరగాల్సి వస్తుంది.
Land Grabs With Support of YCP in Prakasam District: ప్రకాశం జిల్లా ఒంగోలులో గత కొద్ది రోజులుగా వందల సంఖ్యలో నకిలీ రిజిస్ట్రేషన్ల వ్యవహారం కలకలం రేపింది. ఇప్పటి వరకు అందిన ఫిర్యాదుల మేరకు రెవెన్యూ అధికారులు, పోలీసులు సిట్ వేసి.. దర్యాప్తు చేస్తున్నారు. తమకు అన్యాయం జరిగిందంటూ ఇప్పటికీ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. భూములను కాజేసేందుకు నకిలీ వీలునామాలు, దస్తావేజులు, మరణ ధ్రువీకరణ పత్రాలతో నిందితులు చేసిన కుట్రలు, కుతంత్రాలు విస్తుగొలుపుతున్నాయి.
Land kabza: టంగుటూరు మండలానికి చెందిన చినసుబ్బయ్య, వీరమ్మ దంపతులు 1992లో విడిపోయారు. వృద్ధాప్యంలో మార్కాపురానికి చేరుకున్న వీరమ్మకు గురవయ్యతో పరిచయం ఏర్పడింది. 2006లో వీరమ్మ మృతి చెందిన తర్వాత మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందిన గురవయ్య.. ఆస్తిపాస్తులకు తానే వారసుడినంటూ ధ్రువీకరణ పత్రాన్ని సంపాదించాడు.
భూములను వీరమ్మ తనకు రాసిచ్చిందని పేర్కొని.. ముక్తినూతలపాడులోని 2 ఎకరాల 25 సెంట్లకు తానే వారసుడినంటూ వీలునామా సృష్టించాడు. అడంగల్‌లో వీరమ్మకు వారసత్వ, కొనుగోలు డాక్యుమెంట్లు లేకపోయినా.. రాసిచ్చినట్లుగా చెప్పాడు. ఒంగోలులోని ఒక చర్చ్‌కి 5 స్వాధీన విక్రయాలు, మరో అయిదు దావా పత్రాలతో ఎకరం 22 సెంట్లు రిజిస్టర్ చేశాడు. ఒంగోలులో నకిలీ పత్రాలతో భూములు కాజేస్తున్న ముఠా గురించి.. ఆరా తీస్తుండగా.. గురవయ్య వ్యవహారం బయటపడింది. పోలీసులకు దొరికిన వంద పేజీల పుస్తకంలో వివిధ సర్వే నంబర్లతో సుమారు వంద ఎకరాలకు సంబంధించిన వివరాలు, వీలునామాలు బయటపడ్డాయి. ప్రస్తుతం గురవయ్య పరారీలో ఉన్నాడు.
Ongole Land Kabza: ఒంగోలు సమీపంలో ఉన్న మండవవారిపాలెంలో సర్వే నంబర్ 494లో ఉన్న 50 ఎకరాల 50 సెంట్లను పలువురు రైతులు వందేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. ఇటీవల ఓ వ్యక్తి ఒంగోలుకు చెందిన ఇద్దరు వ్యక్తుల పేరున పవరాఫ్ అటార్నీ రాసి.. సుమారు 14 ఎకరాల భూమి ఆక్రమణకు పాల్పడ్డాడు. ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని కొందరు వ్యక్తులు కాజేస్తున్నారంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు.
14 ఎకరాల పవరాఫ్ అటర్నీ పట్టా పొందిన వారిలో ఒంగోలు మేయర్ గంగాడ సుజాత భర్త కూడా ఉన్నారు. అయితే.. ఆ భూమిపై తమకు ఎలాంటి హక్కు లేదని మేయర్ సుజాత పేర్కొన్నారు. కొంతమంది ఆక్రమిస్తున్నారని శ్రీనివాసరావు అనే వ్యక్తి భూములను తన భర్తకు పవరాఫ్ అటార్నీ ఇచ్చారని ఆమె స్పష్టం చేశారు. భూ కబ్జాలు చేసే ముఠాకు రాజకీయనాయకులు అండ ఉందని, ఇక బాధితులకు న్యాయం ఎలా జరుగుతోందని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Land Occupation: ఆ మంత్రుల నియోజవర్గాల్లో యథేచ్ఛగా భూ అక్రమాలు..