సొంతూళ్లకు పంపించాలని వలస కూలీలు గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మెడికొండ్రు మండలం పాలడుగులో ఆందోళన చేశారు. కర్ణాటక రాయచూరు ప్రాంతం నుంచి వ్యవసాయ కూలి పనులు నిమిత్తం సుమారు 400 మంది ఇక్కడకు వచ్చారు. తాము లాక్డౌన్ కారణంగా ఇరుకు పోయామని... తక్షణమే తమను సోంతూళ్లకు పంపించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సొంతూళ్లకు పంపించేందుకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కరుణాకర్, సీఐ అనందరవు హామీ ఇవ్వటంతో వలస కూలీలు వెనక్కి తగ్గారు.
ఇదీ చదవండి :