ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తనపై ఓ వ్యక్తి అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ ప్రకాశం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఘటన జరిగిన గుంటూరులోని కొత్తపేట పోలీసులకు కేసును బదిలీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తపేట సీఐ శ్రీనివాసులు తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శి కొత్తపల్లికి చెందిన ఓ మహిళను అదే ప్రాంతానికి చెందిన రాచకొండ బ్రహ్మయ్య అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు.
ఆమె డిగ్రీ పూర్తి చేసుకుని హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. బ్రహ్మయ్య తనకు తెలిసినవాళ్ల ద్వారా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. ఆమెకు మాయమాటలు చెప్పి గుంటూరుకు తీసుకెళ్లి హాస్టల్ లో ఉంచాడు. ఈ క్రమంలో జులై 11న ఆమెతో ఉద్యోగ విషయం మాట్లాడదామంటూ నగరంలోని విజయశ్రీ లాడ్జికి తీసుకువెళ్లాడు. అక్కడ కొంతసేపు మాట్లాడిన తరువాత తనను అత్యాచారం చేశాడని, అ తరువాత నగ్న వీడియోలు తీశాడని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది.
ఈ విషయం ఎవరికైనా చెప్పినా, తాను రమ్మని పిలిచినప్పుడల్లా రాకపోయినా ఆ వీడియోలు అందరికీ చూపిస్తానని బెదిరించినట్లు భాదితురాలు వాపోయింది. పోలీసుల ప్రాథమిక విచారణలో ఇద్దరూ దూరపు బంధువులుగా తేలింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుగుతున్నట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు.
ఇదీ చదవండి:
Conflict: ధరణికోట ఇసుక స్టాక్ యార్డు వద్ద లారీ డ్రైవర్ల ఆందోళన