ETV Bharat / state

జనసేన నేత జామ తోట దగ్ధం.. ఓర్వలేకే కుట్ర అని బాధితుడి ఆరోపణ

author img

By

Published : Mar 1, 2021, 8:42 AM IST

జనసేన ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకే తన పొలంలోని జామ తోటను కొందరు దగ్ధం చేశారని ఓ వ్యక్తి ఆరోపించాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరు గ్రామంలో జరిగింది. గ్రామంలో తన భార్యను పోటీలో నిలిపినందుకు.. కొందరు అధికార పార్టీ నాయకులు కక్ష సాధింపుగా చర్యగా తోటను తగులబెట్టినట్లు ఆవేదన చెందాడు.

jamathota burnt  in chandaluru
జామతోట దగ్ధం

ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరు గ్రామంలో జనసేన నేతకు చెందిన జామతోటను దుండగులు తగలబెట్టారు. తన భార్య పుప్పాల భూలక్ష్మి.. ఎంపీటీసీ ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేస్తున్న కారణంగానే అధికార పార్టీ నేతలు ఈ దాడి చేశారని యజమాని పాపారావు ఆరోపించారు. శనివారం ఈ ఘటన జరిగిందని.. పొలంలోని వాటర్ డ్రిప్ పైపులు, విద్యుత్ మోటరు పూర్దిగా దెబ్బ తిన్నాయని ఆవేదన చెందారు. దాదాపు రూ.4 లక్షల నష్టం వాటిల్లినట్టు చెప్పారు.

ఇది రాజకీయ కుట్రే..

ఇది కేవలం రాజకీయ కక్ష్య సాధింపు చర్యే అని పాపారావు ఆరోపించారు. తన భార్యను పోటీ నుంచి ఉపసంహరించుకోవాలనే ఈ పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. కొందరు అధికార పార్టీ నాయకులు కక్ష సాధింపుగా.. ప్రత్యర్థి నాయకులపైన పరోక్ష దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహించారు. గతంలోనూ కొంతమంది వ్యక్తులు తనపై దాడి చేశారని.. ఇప్పుడు తన పంటను వారే తగులబెట్టి ఉంటారన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

ఇదీ చదవండి:

ఒంగోలులో జోరుగా పురపాలక ఎన్నికల ప్రచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.