ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని కె.తక్కెళ్లపాడులో లూథియా అనే బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలై తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె... గ్రామ సమీపంలోని పోలాల్లో ఉన్న దిగుడు బావిలో బలవన్మరణానికి పాల్పడింది. బాలిక ఎంతసేపటికీ ఇంటికి తిరిగి రాకపోవడం వల్ల... ఆమె తల్లి ఈశ్వరమ్మ కుటుంబ సభ్యులతో కలిసి చుట్టుపక్కల వెతికింది. చివరకు దగ్గరలోని దిగుడు బావిలో కుమార్తె విగతజీవిగా ఉండటం చూసి తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై సోమశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:దారుణం: బొబ్బేపల్లిలో తండ్రిని కర్రతో కొట్టిచంపిన కుమారుడు