ప్రకాశం జిల్లా అద్దంకి సర్కిల్ పరిధిలో నమోదైన ప్రాపర్టీ నేరాలను అదుపు చేసే దిశగా.. జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాల మేరకు.. దర్శి డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా.. అద్దంకి సీఐ మరియు కొరిసపాడు ఎస్సైలు మేదరమెట్ల వద్ద తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఆ మార్గంలో ప్రయాణిస్తున్న ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని.. సుమారు రూ. 7 లక్షల విలువైన 144 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు బాల్యం నుండే వ్యసనాలకు బానిసలై సులువుగా డబ్బు సంపాదించేందుకు.. ఎవరూ లేని ఇళ్లను ఎంచుకుని నేరాలకు పాల్పడేవారని గుర్తించారు. వీరు గతంలో 330 చోరీ కేసుల్లో నిందితుగా జైలుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లా.. అద్దంకి, అనంతపురం జిల్లా.. గుత్తి పరిసర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు దర్యాప్తులో గుర్తించారు.
ఇదీ చదవండి: