ప్రకాశం జిల్లా సింగరకొండ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మౌలా సాహెబ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అద్దంకి మండలోని వెంపరాల, సాధునగర్ ప్రాంతాల్లో మహిళల మెడలో నుంచి బంగారు ఆభరణాలను దొంగిలించినట్లు అతను అంగీకరించాడు. అంతే కాకుండా గుంటూరు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడి నుంచి ఐదు సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
ఇదీచదవండి: ఒంగోలులో రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య