సోమవారం నుంచి ఒంగోలు, చీరాల, చీమకుర్తి, కందుకూరు, అద్దంకి, పర్చూరు, సింగరాయకొండ ప్రాంతాల పరిధిలోని 91 మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. చీరాల పట్టణం రెడ్జోన్లో ఉన్నందున రూరల్ ప్రాంతాల్లో దుకాణాలు తెరవాలని అధికారులు నిర్ణయించారు. మద్యం దుకాణాల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటుందని భావించిన ఎక్సైజ్ అధికారులు టోకెన్లు జారీ చేస్తున్నారు.
చీరాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 9, పర్చూరు పరిధిలో 6 మద్యం దుకాణాల్లో విక్రయాలకు టోకెన్లు ఇస్తున్నారు. ఈ పరిణామంతో మద్యం ప్రియులు టోకెన్లు తీసుకోవడానికి దుకాణాల ముందు బారులు తీరారు. వీటి కోసం వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతికదూరం పాటించాలని చీరాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సి.ఐ రమేష్ ఆదేశించారు.
ఇదీ చదవండి: