ETV Bharat / state

Power Cut Problems: అనధికార విద్యుత్‌ కోతలు.. విలవిల్లాడుతున్న పరిశ్రమలు - ప్రకాశం జిల్లాలో విద్యుత్ కోతల వార్తలు

పరిశ్రమలకు కావాల్సిందేంటి మౌలిక వసతులు.. అవసరమైనన్ని మానవ వనరులు... మరీ ముఖ్యంగా విద్యుత్‌ సరఫరా! ఇప్పడు ఈ ఒక్కటే తక్కువైందని పారిశ్రామికవర్గాలు మొర పెట్టుకుంటున్నాయి.! పవర్‌ హాలిడేతోనే అల్లాడుతుంటే... అప్రకటిత కోతలతో మరింత ఇబ్బందికరంగా మారిందంటున్నారు..! ప్రకాశం జిల్లాకు పారిశ్రామిక గుర్తింపు తెచ్చిన గ్రానైట్ పరిశ్రమలు.. కరెంటు కోతలతో ఉసూరుమంటున్నాయి.

Power Cut Problems:
Power Cut Problems:
author img

By

Published : Apr 15, 2022, 9:11 AM IST

ప్రకాశం జిల్లాలో అనధికార విద్యుత్‌ కోతలు పరిశ్రమల యాజమాన్యాలకు చుక్కలు చూపిస్తున్నాయి . ప్రకాశం జిల్లా చీమకుర్తి పరిధిలో గురువారం పవర్‌హాలిడే అమలు సంగతి పక్కన పెడితే శుక్రవారం వారంతపు సెలవు. అదీ చాలదన్నట్లు..రోజుకు ఉదయం ఆరు గంటలనుంచి, సాయంత్రం ఆరు వరకూ సరఫరా చేస్తారు. అంటే వారానికి 5 రోజులు, 60 గంటలు మాత్రమే ఉత్పత్తికి అవకాశం. మిగిలిన సమయంలో....త్రీఫేజ్‌ విద్యుత్తు సరఫరా ఉండట్లేదని గ్రానైట్‌ కేంద్రాల యజమానులు అంటున్నారు.

చీమకుర్తి పరిధిలో దాదాపు 500 గ్రానైట్ పాలిషింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో యూనిట్‌లో ప్రత్యక్షంగా 15 నుంచి 20 మంది వివిధ రాష్ట్రాల కార్మికులు పనిచేస్తారు. యూనిట్‌ సామర్థ్యం ఆధారంగా రోజుకు సగటున 15 వందల నుంచి 3వేల చదరపు అడుగుల పలకలను ఉత్పత్తి చేస్తారు. ఈ లెక్కన నెలకు 30వేల నుంచి లక్షల చదరపు అడుగుల వరకూ సిద్ధమవుతాయి. ఇప్పుడీ విద్యుత్‌ కోతల వల్ల నెలవారి లెక్కలేస్తే...10 వేల నుంచి 30 వేల చదరపు అడుగుల పలకుల తయారీయే గగనమైపోయింది.

నిర్వహణ భారంగా మారింది : విద్యుత్తు సరిగా లేకపోవడం వల్ల వ్యాపారం సన్నగిల్లుతోందని...పరిశ్రమల యజమానులు అంటున్నారు. ఎగుమతులు నిలిచిపోవడం, కంటైనర్లు, విద్యుత్తు, ముడిరాయిపై రాయల్టీ పెరుగుదలతో... ఇప్పటికే పరిశ్రమల నిర్వహణ భారంగా మారిందని అంటున్నారు. రోజులో పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేయాల్సినంత సేపు ఉండట్లేదని వ్యాపారులు అంటున్నారు.

చీమకుర్తి పరిధిలో దాదాపు 20వేలమంది ఇతర రాష్ట్రాల కార్మికులు పని చేస్తున్నారు. నెలకు 15వేల వరకూ సంపాదించే తమకు ఇప్పుడు 7, 8వేల రూపాయలు కూడా రావడం లేదని లబోదిబోమంటున్నారు. గ్రానైట్ యూనిట్లకు అనుబంధంగా ఉండే చిన్న వ్యాపారులదీ ఇదే మాట.

ఇదీ చదవండి: Power Cut Problems: "పవర్‌హాలిడే"తో పరిశ్రమలు కుదేలు.. ఆదుకోవాలని వినతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.