తపాలా శాఖ సేవలు విస్తరణలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట సబ్ పోస్టు ఆఫీసులో, ప్రకాశం జిల్లా అద్దంకిలోని సబ్ పోస్టాఫీస్ సెంటర్లో కామన్ సర్వీస్ సెంటర్ సేవలను ప్రారంభించారు. సామాన్య ప్రజలకు అత్యంత చేరువయ్యేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయని అమలాపురం డివిజన్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎస్. రాజారత్నం అన్నారు. కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా బీమా చెల్లింపులు, కరెంటు బిల్లులు, ఆర్టీఏ, వంటగ్యాస్, వాటర్, టెలికాం సేవలు సంబంధించి మరెన్నో రకాల సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు.
ఇదీ చదవండి: 'మా పిల్లలే పింఛను లాక్కుని దాడి చేస్తున్నారు'