సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రకాశంలోని దర్శిలో నిర్వహించిన కబడి పోటీల్లో చినగంజాం జట్టు విజేతగా నిలిచింది. తర్వాతి స్థానంలో దర్శి, వినోదరాయునిపాలెం, కురిచేడు జట్లు నిలిచాయి. స్థానిక ఎమ్మెల్యే సోదరుడు మద్దిశెట్టి. శ్రీధర్ విజేతలకు బహుమతులు అందజేశారు.
నాలుగు రోజులు నుంచి జరుగుతున్న పోటీల్లో... జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 48 జట్లు పాల్గొన్నాయి. ప్రథమ స్థానంలో నిలిచిన చినగంజాం జట్టుకు రూ. 30,000, ద్వితీయస్థానంలో నిలిచిన దర్శి జట్టుకు రూ.20,000... తరువాతి స్థానాల్లో నిలిచిన వినోదరాయుని పాలెం,కురిచేడు జట్లకు రూ.15000, రూ. 10116లు చొప్పున బహుమతి ప్రదానం చేశారు.
ఇదీ చదవండి: 'లక్ష'ణంగా పిడకలతో భోగి మంట