భార్యను చంపిన భర్త... అనుమానమే కారణమా..? - husband murdered his wife in prakasam
అనుమానం పెనుభూతం అని మరోసారి రుజువైంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమె పాలిట యముడయ్యాడు. ప్రకాశం జిల్లా కొత్తూరు చెంచు గిరిజన గూడెనికి చెందిన అంకమ్మను తన భర్త కర్రతో కొట్టి చంపాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.