కరోనా ఆంక్షలు, నిర్మాణ పనుల మందగమనం వల్ల ఉపాధి లేక బేల్దారి కూలీలు పస్తులు ఉండాల్సి వస్తోంది. బేల్దారి, తవ్వకాలు, రవాణా పనులు చేసే వీరంతా ఒంగోలు ఫ్లై ఓవర్ కిందకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తెల్లవారుజామునే చేరుకుంటారు. సాధారణంగా అవసరమున్నవారు ఇక్కడికి వచ్చి కూలీ మాట్లాడుకుని ముఠాలు తీసుకెళ్తారు. ఏడాది నుంచి పనులు నత్తనడకన నడుస్తుండటం వల్ల మధ్యాహ్నం వరకూ ఉపాధి కోసం ఎదురుచూసి నిరాశగా ఇంటిముఖం పడుతున్నారు.
ఇసుక కొరత వల్ల నిర్మాణాలు ఆగిపోయాయని.. కనీసం అన్న క్యాంటీన్ ఉండుంటే 5 రూపాయలకే పొట్ట నింపుకునే వాళ్లమని కూలీలంటున్నారు. అర్ధాకలితో నిద్రపోతున్నామని బేల్దారి మేస్త్రీలు, కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచదవండి.