నాడు-నేడు కార్యక్రమంలో అభివృద్ధి పేరిట.. గొడలకు రంగులద్ది చేతులు దులుపుకుంటున్నారు అధికారులు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించటంలో పూర్తిగా విఫలం అవుతున్నారు. ఫలితంగా విద్యార్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షాలకు కూడా పాఠశాల ప్రాంగణం చెరువును తలపిస్తోంది. దీంతో విద్యార్థులు గొడలను ఆసరాగా చేసుకొని స్కూల్‌కి రావాల్సి వస్తోంది.
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం ఎన్ఎన్ కండ్రిక పంచాయతీ పీరాపురం గ్రామంలో కురుసిన వర్షాలకు పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికి పాఠశాలకు వెళ్లే రహదారి చెరువులను తలపిస్తుంది. దారిలేక విద్యార్థులు పాఠశాల గొడలు, పిట్ట గోడల మీద నుంచి నడుస్తున్నారు. నాడు-నేడు కార్యక్రమంలో భవనాలకు రంగులు వేసే పని మీదే దృష్టి పెట్టారు.. తప్ప పాఠశాల కు వెళ్లే మార్గం మీద, మైదానం మీద దృష్టి పెట్టలేదని పలువురు విమర్శిస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండీ.. జ్ఞానాపురంలో వాణిజ్యపరంగా అభివృద్ధి..తూర్పు రైల్వేకోస్తా నిర్ణయం