ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా చెరువు కట్ట తెగిపోయింది. చెరువులోని నీరంతా ఎస్టీ కాలనీలోకి చేరుతోంది. దీంతో చీరాల-ఒంగోలు మధ్య రాకపోకలకు ఆటంకం కలిగింది. చెరువు మధ్యలో జాతీయ రహదారి నిర్మించడం వలన వరద నీరు వెళ్లేందుకు మార్గం లేక ఇలా రోడ్డుమీదకు వస్తోందని స్థానికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న ఒంగోలు గ్రామీణ సీఐ సుబ్బారావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తన సిబ్బందితో కలిసి రక్షణ చర్యలు చేపట్టారు. ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు నీటిలోకి ఒరిగిపోగా.. గమనించిన సీఐ ప్రయాణికులను కాపాడారు. స్థానిక ప్రజలను అప్రమత్తం చేసి వాహనదారులకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.
ఇవీ చదవండి..