తమను స్వగ్రామాలకు పంపించాల్సిందిగా ప్రకాశం జిల్లా మార్టూరులో వలస కూలీలు మండల కార్యాలయానికి పెద్దఎత్తున చేరుకున్నారు. గ్రానైట్ పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ తదితర రాష్ట్రాలకు చెందిన 2 వేల మందికి పైగా కార్మికులు.. తమను పంపించాలని అధికారులకు విన్నవించుకున్నారు.
ఈ నేపథ్యంలో వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేశారు. అధికారుల ప్రణాళికా లోపంతో తహశీల్దార్ కార్యాలయం వద్దకు గుంపులు గుంపులుగా వలస కార్మికులు చేరుకున్నారు. పోలీసులు పర్యవేక్షించి వారు భౌతికదూరం పాటించేలా చేశారు. పరీక్షలు పూర్తయ్యాక స్వస్థలాలకు పంపిస్తామని ఒంగోలు ఆర్డీఓ ప్రభాకరరెడ్డి చెప్పారు.
ఇవీ చదవండి: