ప్రకాశం జిల్లా ఒంగోలులో సంఘటన-2019 పర్వ్ భాజపా సభ్యత్వ కార్యక్రమానికి హాజరైన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు... నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లుపై స్పందించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఎన్ఎంసీ బిల్లుపై కూలంకషంగా చర్చించిన తర్వాతే...కేంద్రం అమలు చేయడం జరిగిందన్నారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పనితీరుపై అన్ని రాష్ట్రాల నుంచి ఆక్షేపణలు రావటంతోనే ఈ బిల్లును తీసుకొచ్చారని పేర్కొన్నారు. వైద్య రంగాన్ని పూర్తి ప్రక్షాళన చేసేందుకు తీసుకున్న గొప్ప చర్యగా జీవీఎల్ అభివర్ణించారు.
ఇదీ చూడండి: సుష్మా స్వరాజ్ జీవితం.. ఎందరికో ఆదర్శం