ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని గుండ్లకమ్మ నది జలకళ సంతరించుకుంది. ఇటీవల విడుదల చేసిన సాగర్ జలాలు, కురిస్తున్న వర్షాలకు నీటి నిల్వలు పెరిగాయి. మొన్నటిదాకా ఎండిపోయిన గుండ్లకమ్మ నేడు నీటి ప్రవాహంతో ఆహ్లాదకరంగా మారటంతో . పరిసర ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో తాగునీటి కష్టాలు తొలిగిపోయినట్లేనని అద్దంకి పట్టణ వాసులకు సంతోషపడుతున్నారు. గుండ్లకమ్మ నిండుకుండలా మారటంతో వేసవి తాపం నుంచి ఉపశమనం కలగనుందని... మూగజీవాలకు గొంతు తడవనుందని ప్రజలు ఆనందపడుతున్నారు.
ఇవీ చూడండి-'మొగల్రాజపురంలో బౌద్ధ ఛాయాచిత్ర ప్రదర్శన'
:.