ప్రకాశం జిల్లా ఒంగోలులో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 2500 కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. బియ్యం, కూరగాయలు, వంటనూనె, మిఠాయి పొట్లం కిట్లుగా అందించారు. ఈ సామగ్రీ అంతా వాలంటీర్ల ద్వారా, ఇంటింటికి పంపిణీ చేశారు. రెడ్ జోన్ ప్రాంతంలో ఉన్న దుకాణాలు తెరవకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీరి ఇబ్బందులను గుర్తించిన మంత్రి బాలినేని తన సొంత ఖర్చులతో మొత్తం కుటుంబాలన్నిటికీ నిత్యావసరాల కిట్లను పంపించారు.
ఇదీ చూడండి