ETV Bharat / state

Fishing Harbor: వాడరేవులో ఫిషింగ్‌ హార్బర్‌..పూర్తయితే మరింత అభివృద్ధి - prakasam latest news

ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవులో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో హార్బర్‌ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసినా.. సాధారణ ఎన్నికల అనంతరం ఒంగోలు సమీపంలోని కొత్తపట్నానికి ఈ ప్రాజెక్టును తరలించారు. అక్కడ స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో.. మళ్లీ వాడరేవులో ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఈ ప్రాంతంలోని ప్రభుత్వ భూములను కొద్ది రోజుల క్రితం పరిశీలించారు.

Fishing Harbor
Fishing Harbor
author img

By

Published : Aug 7, 2021, 8:44 PM IST

ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవులో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రూ.409.22 కోట్లతో హార్బర్‌ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసినా.. సాధారణ ఎన్నికల అనంతరం ఒంగోలు సమీపంలోని కొత్తపట్నానికి ఈ ప్రాజెక్టును తరలించారు. అక్కడ స్థానికుల నుంచి విముఖత వ్యక్తం కావడంతో.. మళ్లీ వాడరేవులో ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఈ ప్రాంతంలోని ప్రభుత్వ భూములను కొద్ది రోజుల క్రితం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం సాగర్‌మాల ప్రాజెక్టు కింద కేంద్రం మంజూరు చేసిన హార్బర్ల నిర్మాణానికి మొగ్గు చూపుతోంది. అన్నీ అనుకున్నట్లు సాగితే చీరాల తీర ప్రాంతం ఇటు చేపల వేట పరంగానూ.. అటు పర్యాటకంగానూ మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

మూడేళ్ల క్రితమే సర్వే...

వాస్తవానికి మూడేళ్ల క్రితమే వాప్‌కోస్‌ సంస్థ వాడరేవు తీరరలో అయిదు రకాల సర్వేలు చేపట్టింది. నీటి అడుగుభాగం, అలలు, తరంగాలు, భూమి ఎత్తు, పల్లాలు, సముద్రం లోపల, బయట మట్టి స్వభావం, పరిసర గ్రామాల్లోని గాలి నాణ్యత, రసాయనాల ప్రభావం తదితరాలను పరిశీలించింది. అనంతరం మత్స్యశాఖ ద్వారా ప్రభుత్వానికి డీపీఆర్‌ సమర్పించింది. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి.. పర్యావరణ అనుమతులు కూడా మంజూరు చేశారు. హార్బర్‌ నిర్మాణానికి మొత్తం రూ.409.22 కోట్లతో అంచనాలు రూపొందించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యయం మరో రూ.100 కోట్లు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో రూ.300 కోట్లతో నీటిలోనే మూడు కి.మీ. పరిధిలో కొండ రాళ్లతో ఆనకట్ట, దీనిపై రహదారి ఏర్పాటు చేయనున్నారు. బయట నేలపై మరో రూ.200 కోట్లతో వివిధ రకాల మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు.

చేపట్టనున్న పనులివి...

వాడరేవు- రామాపురం మధ్య స్థలాన్ని చదును చేసి పలు రకాల నిర్మాణాలు చేపడతారు. చేపల వేలం కేంద్రం, పరిపాలనా భవనం, వలలు భద్రపరుచుకునేందు, తయారీకి.. బోట్ల మరమ్మతులకు ప్రత్యేక షెడ్లు, క్యాంటీన్‌, విశ్రాంతి భవనం, మరుగుదొడ్లు, చేపల మార్కెట్‌, వ్యాపారుల భవన సముదాయం, తీర ప్రాంత పోలీస్‌ స్టేషన్‌, రేడియో సమాచార టవర్లు, రహదారులు, పార్కులు, మంచినీటి సరఫరా వ్యవస్థ, వ్యర్థ జలాల తరలింపునకు ప్రత్యేకంగా కాలువలు, విద్యుత్తు, ఐస్‌ ప్లాంట్లు, కాలుష్య నియంత్రణకు పచ్చదనం, ఉప్పు నీటిని మంచినీటిగా మార్చే వ్యవస్థ తదితర పనులు చేపడతారు. హార్బర్‌ సాకారమైతే ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుంది. చేపల ఎగుమతి సులభతరమవుతుంది. తుపాన్ల సమయంలో ఎంఎఫ్‌వీ, ఇతర మర పడవలు దెబ్బతినకుండా నిలుపుకొనేందుకు వసతి లభిస్తుంది.

పర్యాటకానికి ఊతం..

ఫిషింగ్‌ హార్బర్‌తో చేపల వేట, ఎగుమతులకు ఊతం లభించడమే కాదు.. పర్యాటక రంగం కూడా మరింత అభివృద్ధి చెందుతుంది. గత నాలుగు దశాబ్దాలుగా చీరాలను పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ.. అనుకున్న స్థాయిలో అడుగులు ముందుకు పడలేదు. హార్బర్‌ ఏర్పాటుతో అన్ని అవాంతరాలు తొలగుతాయి.

అభివృద్ధికి ఆస్కారం..

గతంలో చీరాలకు మంజూరైన ప్రాజెక్టు అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ప్రభుత్వం మళ్లీ దీనిపై దృష్టి సారించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా వచ్చాయి. అంచానాలు మరో రూ.వంద కోట్లు పెరిగే అవకాశం ఉంది. వాడరేవులో నిర్మాణం పూర్తయితే చిన ముంబయిగా పేరొందిన చీరాల మరింత అభివృద్ధి చెందుతుంది. - చంద్రశేఖర్‌రెడ్డి, జేడీ మత్స్య శాఖ, ఒంగోలు

మత్స్యకారుల ప్రయోజనాలు కాపాడాలి...

వాడరేవుకు మళ్లీ ఫిషింగ్‌ హార్బర్‌ మంజూరు కావడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. ముందుగా ప్రతిపాదించినట్లు సముద్రం లోపల హార్బర్‌ నిర్మాణం చేపట్టాలి. మత్స్యకారుల నివాసాలకు నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలి. - ఎరిపిల్లి రమణ, మత్స్యకార ప్రతినిధి

ఇదీ చదవండి:

TIRUMALA TICKETS: శ్రీవారి దర్శన కోటా టికెట్లు 5వేల నుంచి 8వేలకు పెంపు

కడప రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నకిలీ చలాన్ల స్కాంలో చర్యలు.. పలువురు ఉద్యోగుల సస్పెన్షన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.