ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవులో ఫిషింగ్ హార్బర్‌ను ఏర్పాటు చేయాలని మత్స్యకారులు కోరారు. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ను కలిసి వినతిపత్రం అందచేశారు.
వాడరేవులో నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు వచ్చినా ఇంతవరకు పనులు చేపట్టలేదని మత్స్యకారులు వాపోయారు. ఫిషింగ్ హర్బర్‌ను ఏర్పాటుచేసి ఈ ప్రాంతవాసుల చిరకాలస్వప్నం నెరవేర్చాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని మంత్రులు హామీ ఇచ్చారు.