ప్రకాశం జిల్లా త్రిపురంతాకం మండలం మేడపి సమీపంలో ఉన్న బయో డిజిల్ బంకులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడం వల్ల స్థానికులు భయబ్రాంతులకు గురైయ్యారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో డీజీల్ బంకుతోపాటు అక్కడే ఉన్న ఓ కారు పూర్తిగా దగ్ధం అయింది. సుమారు రూ. 5 లక్షల ఆస్తినష్టం జరిగి ఉంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
ఏలూరు పరిధిలో 'ఆరోగ్య అత్యవసర పరిస్థితి' ప్రకటించండి: చంద్రబాబు