పిడుగుపాటుకు గురైన రైతుకు తీవ్రగాయాలైన ఘటన ప్రకాశం జిల్లా జాగర్లమూడిలో చోటు చేసుకుంది. యద్దనపూడి, జాగర్లమూడి ప్రాంతాల్లో వర్షం కురుస్తున్న క్రమంలో యద్దనపూడి నుంచి ద్విచక్రవాహనంపై కొల్లా వారిపాలెం వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
జాగర్లమూడి సమీపంలో..
ఈ క్రమంలో పోలూరు దాటిన తర్వాత.. జాగర్లమూడి సమీపంలో సుబ్బారావుపై పిడుగు పడింది. ఫలితంగా తీవ్ర గాయాలైన సుబ్బారావును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు చీరాల ప్రాంతంలోనూ ఉరుములతో కూడిన జల్లులు కురిశాయి.
ఇవీ చూడండి : ఏపీ ఈసెట్ 2020: వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల