ETV Bharat / state

నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఏడుగురు అరెస్టు

author img

By

Published : Sep 12, 2020, 7:09 PM IST

నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ వివరాలు వెల్లడించారు.

నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఏడుగురు అరెస్టు
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఏడుగురు అరెస్టు

ప్రకాశం జిల్లాలోని ఇంకొల్లు, చీరాల, ఎర్రగొండపాలెం తదితర ప్రాంతాలలో నకిలీ సర్టిఫికెట్లు తయారీ ముఠా గుట్టురట్టయ్యింది. ఒక మహిళతో సహా ఏడుగురిని అరెస్టు చేశారు. సులువుగా డబ్బు సంపాదనే మార్గంగా నిందితులు 9 రాష్ట్రాల్లో నకిలీ సర్టిఫికెట్లు తయారుచేశారని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్​లో సుమారు 500 కోర్సులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికెట్లుగానే నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసి.. 2 వేల నుంచి 5 వేల రూపాయలు వరకు వసూలు చేస్తున్నారు. మొత్తం 2237 సర్టిఫికెట్లు తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నిందితులు జంపని వెంకటేశ్వర్లు యద్దనపూడి, విశాఖపట్నానికి చెందిన బాల శ్రీనివాసరావు, సుజాత, కురిచేడు మండలానికి చెందిన శ్రీనివాసరెడ్డి, ఈపూరుపాలానికి చెందిన కోడూరి ప్రదీప్, ఒంగోలుకు చెందిన కిష్టఫర్, ఎర్రగొండపాలానికి చెందిన వెంకటేశ్వర్లను అరెస్టు చేశారు. నిందితుల నుంచి కంప్యూటర్లు, పెద్ద మొత్తంలో సర్టిఫికెట్లు, మార్కుల లిస్టులు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. 5 లక్షల 47 వేల రూపాయలు నిల్వ కలిగిన బ్యాంకు ఖాతాను సీజ్​ చేశారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.