ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని బురుజుపల్లి తండా సమీపంలో.. అటవీ ప్రాంతంలో ఉన్న నాటుసారా బట్టీలపై ఎక్సైజ్ శాఖ పోలీసులు దాడులు చేశారు. నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న 750 లీటర్ల బెల్లపు ఊటను గుర్తించారు.
వాటిని పోలీసులు ధ్వంసం చేశారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నాటుసారా అమ్మేవారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై సుమందర్ తెలిపారు.
ఇదీ చదవండి: