Markapuram: ప్రకాశం జిల్లా మార్కాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇంజినీరింగ్ ఒప్పంద ఉద్యోగులు వినూత్న నిరసన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అర్ధనగ్న నిరసనకు దిగారు. సమాన పనికి సమానవేతనం ఇచ్చి తమను శాశ్వత ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. వారి డిమాండ్లు ప్రతిధ్వనించేలా కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు.
ఇదీ చదవండి: Devineni Uma House Arrest: వరుసగా రెండో రోజు దేవినేని ఉమా గృహ నిర్బంధం