'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్-2019 క్రికెట్ పోటీలు ప్రకాశం జిల్లా చీరాలలో ఉత్సాహంగా సాగుతున్నాయి. సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ వేదికగా పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. క్వార్టర్ ఫైనల్‌కు చేరిన జట్లు నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. మెుదట జరిగిన పోటీలో పేస్ ఇంజినీరింగ్ కళాశాల గెలుపొందింది. మరో పోటీలో మలినేని లక్ష్మయ్య ఇంజినీరింగ్ కళాశాల జయకేతనం ఎగురవేసింది. ఉత్కంఠగా సాగిన పోటీలో సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాల అత్యధికంగా 42 పరుగుల తేడాతో గెలిచింది. ఈనెల 26న జరగనున్న సెమీ ఫైనల్స్‌కు గెలుపొందిన జట్లు అర్హత సాధించాయి.
ఇదీ చదవండి: దక్షిణాది రాష్ట్రాల బ్యాండ్ పోటీల్లో విజేతగా ఆంధ్రా జట్టు