ETV Bharat / state

'జనవరి 17 వరకు ఇంటర్​ అడ్మిషన్ల ప్రక్రియ'

ఈ నెల 17 వరకు ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ కోర్టు పరిధిలోకి వెళ్లిన కారణంగానే తరగతులు ఆలస్యమయ్యాయన్నారు. ప్రస్తుతం ఆఫ్​లైన్లో అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతోందన్నారు.

education minister adhimulapu suresh
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​
author img

By

Published : Jan 8, 2021, 7:26 PM IST

ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 17 వరకు కొనసాగుతుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ స్పష్టం చేశారు. జనవరి 18 నుంచి జూనియర్ కళాశాలల్లో తరగతులు ప్రారంభమవుతాయన్నారు. ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ కోర్టు పరిధిలోకి వెళ్లిన కారణంగానే తరగతులు ఆలస్యమయ్యాయని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన జీవో నెంబరు 23 వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు అవుతుందన్నారు.

ఇంటర్ ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు పారదర్శకంగా చేపట్టాలనే ప్రభుత్వం ఆన్​లైన్ అడ్మిషన్లకు నిర్ణయం తీసుకుందని మంత్రి సురేశ్ అన్నారు. 50 శాతం మేర అడ్మిషన్లు అయ్యాక.. ప్రైవేటు ఇంటర్ కళాశాలల యజమానులు కోర్టుకు వెళ్లారని మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్ అడ్మిషన్లకు కోర్టు అనుమతి ఇచ్చిందని తెలిపారు. ప్రస్తుతం ఆఫ్​లైన్లో అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతోందన్నారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలూ నిర్వహిస్తామన్నారు. 30 శాతం మేర సిలబస్​ను తగ్గించామని తెలిపారు. ప్రైవేట్​ కళాశాలలు గడచిన విద్యా సంవత్సరంలో 70 శాతం మేర మాత్రమే ఫీజు వసూలు చేయాలని స్పష్టం చేశారు. ఫిర్యాదులు వచ్చిన కళాశాలలపై చర్యలు తీసుకుంటామన్నారు. కొవిడ్‌ వల్ల గతేడాది పరీక్ష ఫీజే తీసుకోవాలని నిర్ణయించామన్నారు. పోటీ పరీక్షలకు ఇబ్బందులు లేకుండా పరీక్షల టైమ్ టేబుల్ త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు.

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​

ఇదీ చదవండి: పవన్‌ కల్యాణ్ పర్యటనకు అనుమతి లేదు: ఎస్పీ నయీమ్ అస్మీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.