2018లో పరీక్షలు నిర్వహించిన తెలుగు డీఎస్సీ, ఎస్జీటీ ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టాలని.. చిత్తూరు జిల్లా మార్కాపురంలో అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంటి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4,600 మంది ఈ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసును పూర్తిచేసి త్వరితగతిన నియామకాలు చేపట్టాలని కోరారు.
ఇవీ చదవండి.. అనారోగ్యంతో పెద్దపులి మృతి...