ప్రకాశం జిల్లా ఒంగోలులో దివాళీ సందడిపై.. వర్షం నీళ్లు చల్లింది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో.. బాణాసంచా వ్యాపారం మొత్తం వెలవెలబోయింది. గతంతో పోలిస్తే.. దుకాణాలు సగానికి తగ్గాయి. అటు ధరలు మండిపోతున్నాయని కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపకపోవడం.. ఇటు ఈ జోరు వర్షాలు కురవడం.. బాగా దెబ్బతీశాయని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.