ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ నిధి పథకంలో భాగంగా 129 మంది వీధి వ్యాపారులకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ద్వారా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు.12 లక్షల 90 వేల రూపాయల చెక్కు మంజూరు కాగా అర్హత కలిగిన వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున రుణం ఇచ్చారు. లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని మెప్మా అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అద్దంకి వైకాపా ఇంఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య, కమిషనర్ పజులుల్లా, మెప్మా అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: వేటపాలెంలో దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని నిరనస