ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కరోనా సోకి.. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి కిట్లు పంపే కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. జిల్లాలో దాదాపు 20 వేల మంది ఇళ్లల్లోనే ఉండి చికిత్స పొందుతున్నారని... కొవిడ్ ఐసోలేషన్ ఇన్‌ఛార్జి కృపారావు తెలిపారు. ఒంగోలులో ఉంటున్నవారికి ఇవాళే కిట్లు పంపామని... జిల్లాలోని మిగతా ప్రాంతాల వారికి సోమవారం నాటికి పంపిణీ చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: