ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలం పీఠాపురంలో వైకాపాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పీఠాపురం గ్రామంలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా వైకాపాలో ఒక వర్గం పలు పనులు చేపట్టింది. ఈ పనుల్లో కాలువ విషయంలో మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేయటంతో... దీనిపై ఇరువర్గాలు ఈ నెల 4న గొడవ పడ్డరు.
విషయం పోలీసులకు తెలవటంతో ఇరువర్గాలపై బైండోవేర్ కేసులు పెట్టారు. మరోసారి గొడవ పడటంతో పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయితే కౌన్సెలింగ్ పేరుతో తమ వర్గానికి చెందిన వారిని దారుణంగా కొట్టారని... వారు కొట్టటంతో తీవ్రంగా గాయపడి రిమ్స్ ఆసుపత్రికి వెళ్లామని కొండలు వర్గం ఆరోపించారు. ఈ విషయాన్ని జరుగుమిల్లి ఎస్సై కమలాకర్ ఖండించారు. ఇరువర్గాలు గొడవ పడితే బైండోవర్ కేసు పెట్టి స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చామని, ఎవరినీ కొట్టలేదని, కొండలుపై గతంలో ఆరు కేసులున్నాయని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: