ETV Bharat / state

కరోనాతో ఉపాధి కోల్పోయాం... ప్రభుత్వమే ఆదుకోవాలి

రాష్ట్రంలో కరోనా ప్రభావంతో ప్రతి ఒక్కరూ ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. చేతిలో ఉపాధి లేక, తినటానికి తిండి లేక పస్తులుంటున్నారు. ఇందులో భవన నిర్మాణ కార్మికులు, కళాకారులు, ప్రైవేటు టీచర్లు గత ఐదు నెలల నుంచి ఖాళీగా ఉంటున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతూ వారు పలు చోట్ల ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు.

ప్రైవేటు ఉపాద్యాయులు, అధ్యాపకులు ఆందోళన
ప్రైవేటు ఉపాద్యాయులు, అధ్యాపకులు ఆందోళన
author img

By

Published : Jul 31, 2020, 5:53 PM IST

రాష్ట్రంలో కరోనా ప్రభావంతో ప్రతి రంగం ఆర్థికంగా చతికిలపడింది. వివిధ రంగాల్లో కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా మారింది. రెక్కాడితెే కానీ డొక్కాడని పరిస్థితి వారిది. చేసేందుకు పని లేక, చేతిలో డబ్బు లేక చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వమే దయ చూపి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

విద్యాసంస్థలు మూతబడ్డాయి...జీవనం గడవలేదు
గత 5 నెలల నుంచి కరోనా వైరస్ కారణంగా విద్యా సంస్థలు మూతపడటంతో తాము జీవనోపాధి కోల్పోయామని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఆందోళన చేపట్టారు.

కరోనాతో ఉపాధి కోల్పోయాం... ప్రభుత్వమే ఆదుకోవాలి
కరోనాతో ఉపాధి కోల్పోయాం... ప్రభుత్వమే ఆదుకోవాలి

కళాకారులను ఆదుకోండి

కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన కళాకారులను ఆదుకోవాలని కోరుతూ బీడీ డ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం నుంచి విజయవాడకు పాదయాత్ర నిర్వహించారు. నాట్య కళను వృత్తిగా చేసుకొని జీవిస్తున్న తాము గత ఐదు నెలలుగా ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కళాకారులు అన్నారు. తమను ముఖ్యమంత్రి ఆదుకోవాలని కళాకారులు కోరారు.

కళాకారులు
కళాకారులు

సంక్షేమ నిధి నుంచి ఆర్థిక సాయం చేయాలి

భవన నిర్మాణ కార్మికులు ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ సమస్య ఏర్పడిందని భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన ఇసుక విధానానికి తోడు కరోనా ప్రభావంతో పనులు లేక కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే జేఏసీ తరపున ప్రత్యక్ష ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు.

భవన నిర్మాణ కార్మికులు
భవన నిర్మాణ కార్మికులు

ఇవీ చదవండి

'నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.