ETV Bharat / state

ఆరోపణల్లో నిజం లేదని వివరించేందుకే ఆ లేఖ రాశా: డీజీపీ

రాష్ట్రంలోని దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. గుప్త నిధుల కోసమే ఆలయాల్లో దొంగతనాలు జరిగాయని అన్నారు. మరోవైపు ప్రతిపక్షనేత చంద్రబాబుకు తాను రాసిన లేఖపైనా ఆయన స్పందించారు.

dgp-gautam-sawang
dgp-gautam-sawang
author img

By

Published : Oct 14, 2020, 5:08 PM IST

Updated : Oct 14, 2020, 5:37 PM IST

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. గతంలో కంటే ఇప్పుడు రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొందని అన్నారు. బుధవారం ప్రకాశం జిల్లా ఒంగోలు వచ్చిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం మీడియాతో మాట్లాడారు. శాంతి భద్రతల విషయంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు, లేఖలు వస్తున్నాయి కదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.

ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎవరైనా లేఖ రాయడంలో తప్పులేదు. అందులో వాస్తవాలు, ఆధారాలతో రాస్తే స్వీకరిస్తాం. కానీ సంఘటన జరిగింది ఒకటైతే.. వ్యాప్తి ఇంకొకటి జరుగుతోంది. కేసు దర్యాప్తు జరుగుతుంటే ఏదేదో చెబితే ఎలా. దేవాలయాల్లో జరుగుతున్నవి దొంగతనాలే... దాడులు కావు. ప్రతిపక్షం రాసిన లేఖలో పేర్కొన్న ఆరోపణలు నిజం కాదు. ఏదైనా చట్టం గురించి ఆరోపణలు వచ్చినప్పుడు పోలీసులుగా దానిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకే నేను ప్రతిలేఖ రాశాను. కాని ఇందులో రాజకీయం ఉందని విమర్శలు చేశారు- గౌతమ్ సవాంగ్, డీజీపీ

హోంగార్డుల సంక్షేమానికి కృషి..

మరోవైపు హోంగార్డుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు డీజీపీ. పోలీసు‌ శాఖలో దిగువస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకూ సాంకేతికతను వినియోగిచుకోవాలని సూచించారు. ప్రకాశం జిల్లా పోలీసులు టెక్నాలజీ అడాప్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకూ సాంకేతిక అంశాలపై అవగాహన కల్పిస్తుండటం మంచి పరిణామమని డీజీపీ అన్నారు. దీనిని కార్యరూపంలోకి తీసుకువచ్చి ప్రకాశం ఎస్పీ సిద్దార్థ్ కౌశల్.. మిగతా జిల్లాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. జిల్లా కలెక్టర్‌ కూడా ఇందుకు సహకారం అందించారని అభినందించారు.

ఇదీ చదవండి

జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ అక్టోబరు 20కు వాయిదా

Last Updated : Oct 14, 2020, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.