అడవిలో తిరగాల్సిన వన్యప్రాణి దారి తప్పి.. పొలాల్లోకి వచ్చి.. శునకాల దాడిలో ప్రాణాలు కోల్పోయింది. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురం గ్రామ ఎస్సీ కాలనీకి దగ్గరలో ఉన్న పొలాల్లో.. కుక్కల దాడి చేశాయి. స్థానిక ప్రజలు గమనించి కుక్కలను తరిమికొట్టారు. అప్పటికే జింక మృతి చెందింది. స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి జింకను పరిశీలించారు. పశువైద్యాధికారి సమక్షంలో పంచనామా నిర్వహించి.. అక్కడే ఖననం చేయాలని అదేశించటంతో కింది స్థాయి సిబ్బంది ఏర్పాట్లు చేశారు.
ఇవీ చూడండి.. ఆక్సిజన్ సిలిండర్ వాహనాలు ప్రారంభించిన కలెక్టర్ పోలా భాస్కర్