ETV Bharat / state

ఏపీని కుదిపేస్తున్న మిగ్‌జాం తుపాను - స్తంభించిన జనజీవనం, అన్నదాతల్లో ఆందోళన - ఏపీలో తుపాను ప్రభావం

Cyclone Michaung Affects on AP : మిగ్‌జాం తుపాన్‌ ప్రభావం కారణంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి ప్రకాశం జిల్లాలోని పంటలన్ని దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. వర్షానికి పలుచోట్ల వాగులు నిండా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని పొలాల్లో నీరు చేరిపోయి రైతులకు తీవ్ర నష్టం మిగిల్చింది. అదేవిధంగా తుపాన్‌ ప్రభావం బాపట్ల జిల్లా వాసులను భయపెడుతోంది. రాత్రి నుంచి వీస్తున్న బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలతో జిల్లాలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. వేలాది ఎకరాల్లోని పంటలు నీటమునిగాయి.

Cyclone_Michaung_Affects_on_AP
Cyclone_Michaung_Affects_on_AP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2023, 1:00 PM IST

Cyclone Michaung Affects on AP : ప్రకాశం జిల్లాలో మిగ్‌జాం తుపాను ముప్పు ముంచుకొస్తుంది. సోమవారం ఉదయం నుంచి జిల్లావ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. రోజంతా చల్లని గాలులు వీస్తుండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు. జన జీవనం స్తంభించింది. విద్యాసంస్థలకు కూడా సెలవులు ప్రకటించడంతో రహదారులు చాలా వరకు బోసిపోయి కనిపించాయి. తుపాను ప్రభావంతో కొత్తపట్నం, సింగరాయ కొండ మండలం పాకల తీరం అల్లకల్లోలంగా మారింది. పెద్ద ఎత్తున అలలు ఎగిసిపడుతుడటంతో తీర ప్రాంతం అక్కడక్కడ కోతకు గురైంది. జిల్లా అంతటా చలిగాలుల తీవ్రత పెరిగింది. సముద్రం ఇరవై మీటర్లకు పైగా ముందుకొచ్చింది. మత్స్యకారులు పడవలు, వలలను సమీపంలోని ప్రధాన రహదారులు, సురక్షిత ప్రాంతాలకు చేర్చుకున్నారు. తీరం వైపు ఎవరూ వెళ్లకుండా మెరైన్, సివిల్ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

మిగ్‌జాం తుపాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు-వేల ఎకరాల్లో నేలకొరిగిన వరి

Cyclone Michaung Affected in Prakasam District : మిగ్​జాం తుపాన్‌ కారణంగా జిల్లా వ్యాప్తంగా సరాసరిన 11సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. గాలులు కారణంగా చలి తీవ్రత పెరిగి వృద్ధులు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. పలు చోట్ల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలు కారణంగా లోతట్టులో ఉన్న పొగాకు చేలల్లోనీళ్లు నిలిచిపోయాయి. ఇదే వర్షం కొనసాగితే పొగాకు పంటకు తీవ్ర నష్టంవాటిల్లు తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాలులు కారణంగా రాత్రి నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అర్థరాత్రి తరువాత ఒంగోలులో కొన్ని ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా పునరుద్దరించినప్పటికీ, మిగిలిన ప్రాంతాల్లో సరఫరా లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. చీమకుర్తి, దర్శి, టంగుటూరు తదితర ప్రాంతాల్లో రాత్రి నుంచి విద్యుత్తు సరఫరా లేక జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒంగోలు కార్పొరేషన్​లో, కొత్తపట్నం, సింగరాయ కొండ ప్రాంతాల్లో అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

సహాయక చర్యలకు సిద్ధం: సహాయక చర్యలు చేపట్టడానికి జిల్లాకు 40 మంది ఎన్డీఆర్ఎఫ్ బృంద సభ్యులను కేటాయించారు. తుపాను తీరం దాటే సమయంలో జిల్లాలో గంటకు 100 కి. మీ వేగంతో గాలులు వీస్తాయని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్​​కు సమాచారం అందడంతో అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది.

రాష్ట్రంలో తుపాను - పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు రేపు, ఎల్లుండి సెలవులు

లోతట్టు ప్రాంతాలపై దృష్టి : కోస్తా తీరప్రాంత మండలాలైన ఒంగోలు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు, టంగుటూరు, సింగరాయ కొండ మండలాలకు తుపాను ముప్పు ప్రధానంగా ఉంది. దీంతో గత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒంగోలు నగరంతో పాటు, ఇతర మండలాల్లోని లోతట్టు ప్రాంతాలను అధికారులు గుర్తించారు. అయిదు మండలాల పరిధిలో 52 ఆవాస ప్రాంతాలతో పాటు, ఒంగోలు నగరంలో 15 శివారు కాలనీలను ముంపు ప్రాంతాలుగా గుర్తించారు.

దూసుకొస్తున్న మిగ్​జాం తుపాను- ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు

Cyclone Michaung Alert : అవసరమైతే లోతట్టు కాలనీ వాసులను తరలించేందుకు వీలుగా ఇప్పటికే అందుబాటులో ఉన్న తుపాను షెల్టర్లతో పాటు, ప్రభుత్వ పాఠశాలలు, సామాజిక భవనాలు, అంగన్వాడీ కేంద్రాల వంటి వాటిని యంత్రాంగం సిద్ధం చేసింది. బియ్యం, కందిపప్పు అందుబాటులో ఉంచడంతో పాటు, వంట బాధ్యతను పలు చోట్ల మధ్యాహ్న భోజన నిర్వాహకులకు అప్పగించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కేంద్రాలకు వచ్చిన కుటుంబాలకు రూ.2,500 నగదుతో పాటు, 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు అందిస్తారు.

LIVE UPDATES: తీర ప్రాంతం జిల్లాల్లో రెడ్ అలెర్ట్ - రాష్ట్రంపై తీవ్ర ప్రభావం

Cyclone Michaung Affected in Bapatla District : అదేవిధంగా మిగ్‌జాం తుపాను బాపట్ల జిల్లా వాసులను భయపెడుతోంది. రాత్రి నుంచి వీస్తున్న బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలతో జిల్లాలోని అనేక లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. వేలాది ఎకరాల్లోని పంటలు నీటమునిగాయి. రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. పలు గ్రామాల్లో చెట్లు నేలకూలాయి. అనేక పల్లెలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. మింగ్ జాం తుఫాన్ కారణంగా చీరాల, పర్చూరు, చినగంజాంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పర్చూరు ప్రాంతంలో పంటపొలాలు నీట మునిగాయి. తుపాన్ బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం ఉండటంతో, సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. సూర్యలంక బీచ్ వద్ద తీవ్రమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. బాపట్లకు దగ్గరలోనే తీరం దాటనున్న నేపథ్యంలో అధికారులు ముందుగానే తీర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసి సహాయక శిబిరాలకు తరలించారు.

మిగ్​జాం బీభత్సం- భారీ వర్షాలకు 8 మంది మృతి, స్కూళ్లు బంద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.