ETV Bharat / state

ఇప్పుడు మరణం ఓ శాపమే.. అంత్యక్రియలు అతికష్టమే - కరోనా మరణాలతో సమస్యలు న్యూస్

బాధ్యతలు తీరి.. కోరికలు నెరవేరి.. వయసు మళ్లీ... తుది శ్వాస వదిలితే.. నా అన్నవాళ్లు కన్నీటి వీడ్కోలు పలికితే.. అది ఘనమైన నివాళి. సమాజం కోసం తపించి... దేశమే ప్రాణంగా బతికి... ప్రాణాలర్పిస్తే.. రాజ్యమే కన్నీరు పెడితే.. అదోరకమైన నివాళి. కానీ ఇప్పుడు మరణమే ఓ శాపం. చస్తే... నీ మెుహన్ని చూసే వాడూ లేడు. ఇక అంతక్రియలంటారా? ఆ ఆలోచనే రాదు. సహజ మరణమైనా.. కరోనా మరణమైనా.. ఇప్పుడు చివరి చూపునకు వెళ్లలేని దుస్థితి.

ఇప్పుడు మరణం ఓ శాపమే.. అంత్యక్రియలు అతికష్టమే

author img

By

Published : Jul 27, 2020, 12:23 AM IST

కరోనా వైరస్.. ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపింది. ఇప్పుడు ఏం చేయాలన్నా.. ఆంక్షలే. అంతిమయాత్ర లేదు... ఆఖరి చూపు చూసేవారు లేరు. ఏ మరణం సంభవించినా.. అది కరోనా గాటినే పడుతోంది. ఓ వ్యక్తి మరణిస్తే, ఆత్మ బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు చివరి చూపుగా వచ్చి నివాళులర్పించి అంత్యక్రియలు ఘనంగా నిర్వహించే వారు.. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు.. కరోనా కారణంగా మరణించినవారి పరిస్థితి, వారి కుటుంబ సభ్యుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. సమాజంలో నెలకొన్న అనుమానాలు ఓ కారణమైతే, అధికారులు నిర్వాకం కూడా మరో కారణం.

ఉదాహరణకు ప్రకాశం జిల్లానే తీసుకుంటే అర్థమవుతుంది. ఒంగోలు జీజీహెచ్​లో అధికారుల లెక్కల ప్రకారం మృతి చెందిన వారి సంఖ్య.. 49. ఇప్పటి వరకూ... 33 మందికి మాత్రమే అంత్యక్రియలు జరగ్గా... ఇంకా 16 మంది మృతదేహాలు మార్చురీలోనే ఉన్నాయి. ఈ మృతదేహాల అప్పగింతలోనూ... అనేక విషయాలు తెలుస్తున్నాయి. ఊళ్లలో గ్రామస్థుల అనుమానాల కారణంగా కనీసం అంత్యక్రియలకు నోచుకోని శవాలు ఆ మార్చురీలోనే ఉన్నాయి.

ఒంగోలు కమ్మపాలానికి చెందిన ఓ వృద్ధుడు అనారోగ్య కారణాల వల్ల ఒంగోలు రిమ్స్‌లో చేరాడు. గుండెపోటుతో ఆసుపత్రిలోనే మరణించాడు. మరణానంతరం కరోనా పరీక్ష చేయగా పాజిటివ్​గా తేలింది. ఇక ఆయన మృతదేహం మార్చురీకే పరిమితమైంది. ఐదు రోజుల తర్వాత.. కుటుంబ సభ్యులు సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా మృతదేహాన్ని అప్పగించారు. ఇదే తీరుగా మరో వ్యక్తి విషయంలో సిబ్బంది ప్రవర్తించారు. ఆఖరికి మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా...మృతదేహాన్ని అప్పగించారు.

ఇక అప్పగించిన మృతదేహాలకు అంత్యక్రియలు చేయడం మరో కష్టంగా మారింది. తమ ఊరి వాడిని ఖననం చేయడానికి కూడా గ్రామస్థులు.. అంగీకరించడం లేదు. మృతదేహం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందనే.. భయం వారిలో నాటుకుపోయింది. యర్రజర్ల వద్ద రెండు మృతదేహాలు విషయంలో గ్రామస్థులు అలానే అడ్డుకున్నారు.

కొన్ని గ్రామాల్లో మరి దారుణంగా ఉంది పరిస్థితి. మద్దపాడు మండలం గుండ్లకమ్మ ప్రాజెక్టు సమీపంలో కొండల్లో రెండు మూడు మృతదేహాలను ఖననం చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.. సంతనూతలపాడులో ఓ విశ్రాంత ఉపాధ్యాయురాలు మృతి చెందితే కరోనాతో మృతి చెందిందని భావించి, ఆమె అంత్యక్రియలను గ్రామస్థులు అడ్డుకున్నారు. చివరికి కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయిస్తే, కోర్టు ఆదేశాలతో.. పోలీసుల బందోబస్తుతో అంత్యక్రియలు నిర్వహించారు.

కరోనా వైరస్‌ మనిషి బతికి ఉంటేనే... జీవించి ఉంటుందని.. అధికారులు చెబుతున్నా ఎవరికీ పట్టడం లేదు. అనవసర భయాలతో అంత్యక్రియలు జరగకుండా చేస్తున్నారు. ఇలా .. ఒక్క ప్రకాశం జిల్లాలోనే కాదు.. చాలా ప్రాంతాల్లో ఎలాంటి మరణం సంభవించినా... అంత్యక్రియలకు నోచుకోని శవాలు మార్చురీల్లో ఉన్నాయి

ఇప్పుడు మరణం ఓ శాపమే.. అంత్యక్రియలు అతికష్టమే

ఇదీ చదవండి: ఏపీలో ఆ కుటుంబానికి ట్రాక్టర్ కొనిస్తా: సోనూసూద్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.