ఆనందయ్య మందు(anandyya medicine)కు ఎక్కడ ఎలాంటి శాస్త్రీయత లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని సీపీఎం కార్యాలయంలో మాట్లాడుతూ ఏ పార్టీకి.. ఆ పార్టీ వారు తమ రాజకీయ ప్రచారం కోసం ఆనందయ్య మందు(anandyya medicine)ను వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హైకోర్టు వరకు ఎలాంటి శాస్త్రీయత లేని ఆనందయ్య మందు(anandyya medicine)కు ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆనందయ్య మందు(anandyya medicine)ను తీసుకున్న వారు ఆస్పత్రుల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు.
కరోనా నుంచి ఆనందయ్య మందు(anandyya medicine) కాపాడితే టీకాలు తయారు చేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఒత్తిళ్లకు తలొగ్గే రాష్ట్ర ప్రభుత్వం... మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను, చెత్త పన్నును అదనంగా వసూలు చేస్తూ జీవోను జారీ చేసిందని మధు విమర్శించారు.. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెంచిన ఆస్తిపన్ను, చెత్త పన్నుల జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.