ETV Bharat / state

'టిడ్కో ఇళ్లపై రేపటిలోగా తేల్చండి.. లేకపోతే మేమే తీసుకుంటాం'

author img

By

Published : Nov 13, 2020, 3:07 PM IST

టిడ్కో ఇళ్లపై రేపటిలోగా ప్రభుత్వం తమ నిర్ణయం చెప్పాలని.. లేదంటే 16న తామే ఇళ్లు స్వాధీనం చేసుకుంటామని సీపీఐ రామకృష్ణ అన్నారు. పూర్తయిన ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా నిరంకుశంగా వ్యవహరించడం అన్యాయమన్నారు.

cpi ramakrishna
సీపీఐ రామకృష్ణ

టిడ్కో ఇళ్ళు అత్యంత నాణ్యత ప్రమాణాలతో నిర్మించినవని, లబ్ధిదారులకు వెంటనే వాటిని కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్మించిన టిడ్కో ఇళ్ళను తెదేపా నాయకులతో కలిసి పరిశీలించారు. ఒకవేళ ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగితే దర్యాప్తు చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని.. అంతేకానీ వాటిని పేదలకు అప్పగించకుండా నిరంకుశంగా వ్యవహరించడమేంటని ప్రశ్నించారు. ఒంగోలులో నిర్మించిన టిడ్కో కాలనీకి మురుగునీటి వ్యవస్థ, రోడ్లు, విద్యుత్తు, మంచినీటి సౌకర్యాలు కల్పించాలని.. వీటన్నిటిని పూర్తి చేసి తక్షణం లబ్ధిదారులకు అప్పగించాలని రామకృష్ణ అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇళ్ళ విషయంపై రేపటిలోగా ప్రభుత్వం తన నిర్ణయం ప్రకటించాలని.. లేదంటే 16వ తారీఖున తామే లబ్ధిదారులతో కలిసి స్వాధీన పరుచుకుంటామని అన్నారు. పేదలకు ఇళ్ళ పట్టాలు పంచుతామని చెప్పి స్థలాల సేకరణలో ఎమ్మెల్యేలు, మంత్రులు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దీని విషయం తేల్చాలని, ఇప్పటికే 4 సార్లు పంపిణీ కార్యక్రమాలు వాయిదా వేసి, తిరిగి ఎదుటవారిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇవీ చదవండి..

తమ్ముడి పేరిట సందేశం.. 2లక్షల రూపాయలకు టోపీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.