ఆకట్టుకుంటున్న ఆవు-కుందేళ్ల స్నేహం ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని దోరకాయ పాలానికి చెందిన గోనుగుంట సుబ్బారావు ఆవులను పెంచుతుంటాడు. వారి పిల్లల కోరిక మేరకు ఆరు నెలల క్రితం ఒక జత కుందేళ్లను ఇంటికి తీసుకువచ్చాడు. మొదట్లో ఆ కుందేళ్లను వదిలితే ఆవు కాళ్ల కింద పడి ఎక్కడ చనిపోతాయోనని భయపడ్డాడు. కానీ వచ్చిన పది రోజుల్లోనే ఆవులు, కుందేళ్ల మధ్య స్నేహం కుదిరింది. నిత్యం ఆవులతోనే ఉంటూ... వాటి వద్దే పడుకుంటున్నాయి. ఆవులు కూడా కుందేళ్ళపై అపారమైన ప్రేమను కనబరుస్తున్నాయి. జాతులు వేరు అయినప్పటికీ వాటి స్నేహం చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంది అని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి
చిన్నారుల ఆన్లైన్ ఆటల సమయంపై 'కర్ఫ్యూ'