ETV Bharat / state

తొలివిడతగా జిల్లాలో 31 వేల కొవిడ్​ వ్యాక్సిన్ డోసులు.. - వాక్సిన్​ పంపిణీ తాజా సమాచారం

ప్రకాశం జిల్లాలో మొదటగా వైద్య సిబ్బంది, అంగన్​వాడీలకు కొవిడ్​ టీకాను వేయనున్నారు. ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న టీకా పంపిణీలో భాగంగా.. తొలివిడతగా జిల్లాకు చేర్చిన 31 వేల డోసుల వ్యాక్సిన్​ను ఒంగోలులోని వ్యాధి నిరోధక కేంద్రంలో భద్రపరిచారు. వ్యాక్సిన్​ను అధికారులు పరిశీలించారు.

covid vaccine doses arrived to ongole
ప్రకాశం జిల్లాలో కొవిడ్​ టీకా
author img

By

Published : Jan 13, 2021, 4:26 PM IST

ప్రకాశం జిల్లాలో తొలివిడతగా 25వేల మంది వైద్యులు, వైద్య సిబ్బంది, అంగన్​వాడీ కార్యకర్తలకు కొవిడ్ టీకా వేయనున్నారు. ఇందులో భాగంగా అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం.. తొలివిడతగా 31 వేల డోసులు వ్యాక్సిన్ ఒంగోలుకు చేర్చారు. వ్యాక్సిన్​ను జిల్లా వ్యాధి నిరోధక కేంద్రంలో భద్రపరిచారు. టీకా భద్రపరిచిన కేంద్రంలో నిరంతరం పరిశీలనలో భాగంగా ఇప్పటికే సీసీటీవీ కెమెరాలు.. విద్యుత్ అంతరాయం రాకుండా జనరేటర్​లను ఏర్పాటు చేశారు.

వాక్సిన్​ కేంద్రాల వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ఈనెల 16 నుంచి వ్యాక్సిన్​ పంపిణీ జరగనుండగా.. రెండు మార్గాల్లో జిల్లా వ్యాప్తంగా వ్యాక్సిన్ తరలించడానికి రెండు వ్యానులను సిద్ధంగా ఉంచారు. బుధవారం ఉదయం జిల్లాకు చేరుకున్న వ్యాక్సిన్​ను అధికారులు పరిశీలించారు. వాటిని అక్కడ ముందుగానే సిద్ధం చేసిన రెండు రిఫ్రిజిరేటర్లలో భద్రపరిచారు.

ఇదీ చదవండి: చీరలందు ఈ 'గడ్డి చీర' వేరయా.. ఉతికితే.. ఎలా మరి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.