కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కారణంగా గ్రామాల్లో ఆంక్షలు కఠినతరం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా చినగంజాం పంచాయతీ ఆధ్వర్యంలో కొవిడ్ నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను గ్రామంలోని వీధుల్లో మైకు ద్వారా ప్రచారం చేస్తున్నారు. గ్రామంలో విధిగా అందరూ భౌతిక దూరం పాటించాలని, ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని ఆంక్షలు విధించారు. అంతేనా.. బయట వ్యక్తులకు ప్రవేశం నిషిద్ధం అని, ఒక వేళ రావాలంటే కొవిడ్ నెగిటివ్ రిపోర్టు తప్పని సరి అని ప్రచారం చేయిస్తున్నారు పంచాయితీ పెద్దలు. నిబంధనలు ఉల్లంగిస్తే జరిమానా, చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండీ.. కరోనా : అనుమానంతో చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య