ETV Bharat / state

ఒకేరోజు కరోనాతో ఐదుగురు మృతి...భయాందోళనలో ఇంకొల్లు! - ఇంకొల్లులో ఒకేరోజు కరోనాతో ఐదుగురు మృతి

కొవిడ్​తో నిమిషాల వ్యవధిలో దంపతులు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా ఇంకొల్లులో జరిగింది. అదే గ్రామంలో మంగళవారం కరోనాతో మరో ముగ్గురు మరణించారు. ఒకే రోజు ఐదుగురు మృతి చెందటంతో... ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

couple died with Corona
couple died with Corona
author img

By

Published : May 12, 2021, 10:46 AM IST

కరోనా లక్షణాలతో చికిత్స పొందుతున్న దంపతులు నిమిషాల వ్యవధిలో కన్నుమూసిన సంఘటన ప్రకాశం జిల్లా ఇంకొల్లులో చోటుచేసుకుంది. కొద్దిరోజుల కిందట అస్వస్థతకు గురైన దంపతులు పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్​గా తేలడంతో వారం రోజులుగా ఒంగోలు రిమ్స్ లో చేరి చికిత్స పొందుతున్నారు. పరిస్దితి విషమించి మంగళవారం ఉదయం10 గంటల30 నిమిషాలకు భర్త(62) తరువాత పది నిమిషాలకు భార్య (58) కన్నుమూశారు. నిమిషాల వ్యవధిలోనే దంపతులు మృతిచెందటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

ఇంకొల్లుకు చెందిన ఓ మహిళ, మరో ఇద్దరు వ్యక్తులు వేరే ప్రాంతాల్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఒక్కరోజే ఇంకొల్లు గ్రామానికి చెందిన అయిదుగురు ప్రాణాలు కోల్పోవటంతో స్థానికంగా విషాదం నెలకొంది.

ఇదీ చదవండి: వైరస్‌ బూచితో అంబులెన్స్‌కు రూ.వేలు వసూలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.