ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం నాగంబొట్లవారిపాలెం గ్రామంలోని రేషన్ డీలర్ రమేష్... లబ్ధిదారులకు విభిన్న రీతిలో రేషన్ సరకులు పంపిణీ చేశారు. కరోనా వైరస్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. రేషన్ దుకాణానికి చేరుకునే ముందు లబ్ధిదారులు చేతులు శుభ్రం చేసుకునే విధంగా సబ్బు, శానిటైజర్ ఏర్పాటు చేశారు. సామాజికదూరం పాటించే విధంగా గుర్తులను ఏర్పాటు చేసి ఆ కుర్చీలు వేసి కూర్చోబెట్టారు.
లబ్ధిదారులు ఎండకు ఇబ్బంది పడకుండా టెంటు వేశారు. మాస్కులు అందించారు. కరోనా నివారణపై.. సూక్తులను ప్లకార్డులపై రాయించి... లబ్ధిదారుల చేతికిచ్చారు. రేషన్ డీలర్ చేస్తున్న పనిని స్థానిక ఎస్సై నాగరాజు అభినందించారు. ప్రతి ఒక్కరూ కరోనా నిమమాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
ఇదీ చదవండి: 'రోడ్లపై కనిపిస్తే రసాయనాల దాడి చేస్తారా?'