ETV Bharat / state

చీరాలలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా - corona cases increased in chirala latet news update

ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒక్కరోజే ఆరు పాజిటివ్​ కేసులు నమోదు కావడంతో ఆధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు. కరోనా బాధితులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన వారు విధిగా పరీక్షలు నిర్వహించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

corona positive cases increased
చీరాలలో వ్యాపిస్తున్న కరోనా
author img

By

Published : Jun 28, 2020, 1:55 PM IST

చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి కేసులతో ప్రకాశం జిల్లా చీరాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే 50కిపైగా కేసులు నమోదు కాగా శనివారం ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చీరాల మండలం రామకృష్ణాపురంలో ఒక వృద్ధుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా ఆయన తోపాటు కుటుంబసభ్యులను కూడా అంబులెన్స్​లో ఒంగోలులోని ఐసోలేషన్​కు తరలించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారితో సంబంధాలు కలిగిన ప్రతి ఒక్కరు విధిగా విఆర్​డీఎల్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.

ఇవీ చూడండి...

'కరోనా కట్టడికి అందరూ సహకరించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.