ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ అధ్యాపకులతో ఒప్పందం చేసుకున్న ప్రకారం 12 నెలల కాలానికి రెన్యూవల్ ఉత్తర్వ్యులు ఇవ్వాలని వారు కోరారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలంటూ వారు విజ్ఞప్తి చేశారు. ఈ ఒప్పంద పద్దతిపై పనిచేస్తున్న వారిని పదవీ విరమణ వయసు 58 నుంచి 60 సంవత్సరాలకు పొడిగించాలని వీరు డిమాండ్ చేశారు. గత 4 నెలలుగా రెన్యూవల్ ఉత్తర్వులు లేక జీతాలు రాక ఇబ్బంది పడుతున్నామని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు...ఈ సందర్బంగా వైఎస్ఆర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు.
ఇదీ చూడండి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి తెదేపా నేత నారా లోకేశ్ లేఖ